ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు (sandalwood), మాజీ మంత్రి అనంత్ నాగ్ (Ananth Nag) ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కర్నాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నలిన్ కటీల్ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్టీ కార్యాలయంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారు.
ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు (sandalwood), మాజీ మంత్రి అనంత్ నాగ్ (Anant Nag) ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కర్నాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నలిన్ కటీల్ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్టీ కార్యాలయంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో ఈయన ఎమ్మెల్యేగా(MLA), ఎమ్మెల్సీగా (MLC) ఉన్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం జెహెచ్ పటేల్ ( J. H. Patel) ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అతను బెంగళూరు (Bengaluru) అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్‌గా పని చేశారు. 2004లో చామరాజ్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనతా దళ్ సెక్యులర్ (Janata Dal Secular) పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎస్ఎం కృష్ణపై (S.M. Krishna) పోటీ చేశారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్న అనంత్ నాగ్ ఇప్పుడు జేపీ నడ్డా (JP Nadda) జట్టులో చేరుతున్నారు. అనంత్ నాగ్ (Anan Nag) కర్నాటక (Karnataka) ప్రజలకు నటుడిగా చాలా దగ్గరివారు. కన్నడ, హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ సహా వివిధ భాషల్లో నటించారు. 300 వరకు సినిమాల్లో నటించగా, 200 కన్నడ సినిమాలు ఉన్నాయి. టెలివిజన్ షోలలోను కనిపించారు. ఆయన వయస్సు ప్రస్తుతం 74. సంకల్ప సినిమా ద్వారా 1973లో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ప్రేమ లేఖలు, అనుగ్రహం, శాంతి క్రాంతి, రాత్రి, శంఖారావం, బాలు, భీష్మ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వచ్చిన బాలు (Balu) సినిమాలో బాబాగా నటించారు అనంత్ నాగ్.
త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Legislative Assembly election) ఉన్నాయి. 24 మే 2023తో ప్రస్తుత ప్రభుత్వం కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ నాట అధికారంలో ఉన్న బీజేపీ (BJP) మరోసారి ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాల ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కన్నడ నాట ఎన్నికలకు వెళ్తోంది. కాంగ్రెస్ అధ్యక్షులు డీకే శివకుమార్, ఆ పార్టీ శాసన సభా పక్ష నేత సిద్ధరామయ్యల నేతృత్వంలో కాంగ్రెస్ ఈసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటక ఎన్నికల కోసం జనతా దళ్ (S) ఇప్పటికే 90 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించింది. ఈ మూడు పార్టీలే కీలకం.
2024 ఏప్రిల్ – మేలో జరగనున్న లోకసభ ఎన్నికలకు ముందు 2023లో చిన్న, పెద్ద రాష్ట్రాలు కలిపి తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వీటికి కమలం పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఈశాన్య ప్రాంతాల్లోని నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, చత్తీస్ గఢ్, ఎన్నికలు ఉన్నాయి. తొలుత కర్నాటకలో, ఆ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మిగతా ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ కన్నడ నాటపై ప్రత్యేక దృష్టి సారించింది. మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటేనే వచ్చే లోకసభ ఎన్నికల్లో అధిక ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇబ్బందికరం. ఇక్కడ మొత్తం 28 లోకసభ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో బీజేపీ 25, కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కోటి చొప్పున గెలిచాయి. ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు.