కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసు పథకం ఆటోవాలాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసు పథకం ఆటోవాలాల ఉపాధి మీద దెబ్బకొట్టింది. కస్టమర్లు లేక, రోజంతా ఆటో తోలినా ఆశించిన డబ్బులు రాక ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. అయిదు గంటల పాటు కష్టపడ్డాక రూ.40 కళ్లజూసిన ఓ బెంగళూరు ఆటోడ్రైవర్ (Autodriver) ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోలో, ఆటో డ్రైవర్ ఆ డబ్బులను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆటోనడిపానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితాలకు ఆశపడి ప్రజలు ఓట్లు వేశారని, దాని ప్రతికూల ప్రభావం నేరుగానూ, పరోక్షంగానూ కనపడుతోందని ఈ వీడియో(Video)పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మహిళలతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయని, పురుషులు బస్సుల్లో నుంచి బయటకు ఎలా వస్తారు? బస్సులు ఎలా ఎక్కుతారని మరో యూజర్ కామెంట్ (User Comment) చేశాడు.
A Bengaluru auto driver in tears after collecting just Rs 40/- from 8 am to 1 pm. This is the result of free bus rides given by the new Cong govt in Karnataka. Pushing people into poverty. pic.twitter.com/2RZEjA9pw8