»Hyderabad For The Sixth Time In A Row Bhagyanagaram Is In The List Of The Best Cities In The Country
Hyderabad: వరుసగా ఆరోసారి..దేశంలోనే బెస్ట్ సిటీ లిస్ట్‌లో భాగ్యనగరం
దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో మరోసారి హైదరాబాద్ నిలిచింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. భాగ్యనగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్ నగరానికి మరోసారి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో హైదారాబాద్ నిలిచిందని.. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ వెల్లడించింది. ఈ కంపెనీ విడుదల చేసిన నగరాల్లో వియన్నా తొలి స్థానంలో నిలిచింది. అద్భుతమైన కట్టడాలు, సాంస్కృతికత, ఘనమైన చరిత్ర వంటి వివిధ కారణాలతో వియన్నా నగరం అత్యంత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా నిలిచింది. వియన్నా తర్వాత రెండో స్థానంలో జురిచ్ (స్విట్జర్లాండ్), మూడో స్థానంలో ఆక్లాండ్ (న్యూజిలాండ్) నిలిచాయి.
Hyderabad is yet again rated as the best Indian city by Mercer
భారత్‌లో హైదరాబాద్ (153వ స్థానం) అగ్రస్థానంలో నిలిచింది. పూణే, బెంగళూరును వెనక్కి నెట్టి మరి అగ్రస్థానంలో నిలిచింది. పూణే (154) రెండో స్థానం, బెంగళూరు (156) మూడో స్థానం, చెన్నై (161) నాలుగో స్థానం, ముంబాయి (164) అయిదో స్థానం, కోలకతా (170) ఆరో స్థానం, న్యూఢిల్లీ (172) ఏడో స్థానంలో నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్‌లో ఖౌర్టౌమ్ (సుడాన్) 241వ ర్యాంక్‌తో చివరిగా నిలిచింది. దేశంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడంతో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2015 నుంచి హైదరాబాద్ వరుసగా ఆరోసారి ఈ ఘనత సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
Hyderabad is yet again rated as the best Indian city by Mercer