»Cinema Is Not A One Man Show Kalyan Ram Said Devil Trailer Event
Kalyan Ram: సినిమా వన్ మ్యాన్ షో కాదు..అది చాలా తప్పు
నందమూరి కళ్యాణ్‌రామ్ తన కెరీర్ ప్రారంభం నుంచి విలక్షణమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వస్తున్నారు. తాజాగా డెవిల్ చిత్రంతో మరోసారి క్రేజీ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. తాను యాక్ట్ చేసిన డెవిల్ చిత్రం ట్రైలర్ నిన్న విడుదల కాగా..ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ సహా ఈ సినిమా బృందం కీలక విషయాలను పంచుకుంది.
cinema is not a one man show Kalyan Ram said devil trailer event
టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్(kalyan ram) యాక్ట్ చేసిన డెవిల్(devil) మూవీ ట్రైలర్ నిన్న విడుదల కాగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక సందర్భంగా హాజరైన నందమూరి కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా గురించి ఎవరో వన్ మ్యాన్ షో అన్నారని కల్యాణ్ రామ్ గుర్తు చేశారు. కానీ అది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. అంతేకాదు ఒక సినిమా నిర్మించి అది బయటకు రావాలంటే అనేక మంది కృషి ఉంటుందని స్పష్టం చేశారు.
కథ, దర్శకత్వం, కెమెరా, హీరో, హీరోయిన్, టెక్నిషియన్లు, కాస్టూమ్ డిజెనర్లు ఇలా అనేక మంది పనితనం ఉంటుందని వెల్లడించారు. ఖర్చుకు వెనుకాడకుండా సినిమా నిర్మించే ప్రొడ్యూసర్ సహా ప్రతి ఆర్టీస్ట్ కష్టం సినిమా వెనుక ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో సినిమాను దయచేసి వన్ మ్యాన్ షో(one man show) అనొద్దని వెల్లడించారు. రాసుకోండి డెవిల్ చిత్రం చాలా బాగుంటుందని అన్నారు. మీకు కావాల్సిన కమర్షియల్ ఆస్పెక్ట్ అన్ని ఉంటాయని కల్యాణ్ రామ్ ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. దీంతోపాటు ఏప్రిల్ లేదా మే నెలలో బింబిసార2 చిత్రం షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. మీరు మా ప్రయత్నాలను అభినందించినప్పుడు, మా ఆనందం రెట్టింపు అవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బింబిసార చిత్రానికి వచ్చిన స్పందనకు ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. మేము నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తే, దానిని అభినందించడానికి మీరు ఎంతకైనా తెగిస్తారని మీరు ఎల్లప్పుడూ నిరూపించారు. డిసెంబర్ 29న థియేటర్లలోకి రానున్న డెవిల్ కొత్త కథతో పాటు అన్ని కమర్షియల్ హంగులతో జనాలను మెప్పించేలా ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ కథ ఎంపికపై అభిషేక్ నామా(abhishek nama) ప్రశంసలు కురిపించారు. ఒక కమర్షియల్ సినిమా తీయడం చాలా సులభం. కానీ డెవిల్ లాంటి సినిమాకి రెండేళ్ళకు పైగా పని చేయడానికి అభిరుచి, ధైర్యం అవసరం. మీరు ట్రైలర్లో చూసినది ఒక సంగ్రహావలోకనం మాత్రమే. ఈ సినిమా ఆయన అభిమానులకు పండుగలా ఉంటుందని చెప్పారు. అలాగే సంయుక్త అద్భుతమైన ట్రైలర్ కోసం తన ఉత్సాహాన్ని పంచుకుంది. డెవిల్కి మంచి స్క్రిప్ట్, నాణ్యమైన బృందమని చెప్పింది. కొత్తదాన్ని ప్రయత్నించడానికి అవకాశాన్ని అందిస్తాయని మాళవిక నాయర్ పేర్కొంది. తమ్మిరాజు ఎడిటింగ్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి సౌందర్ రాజన్ కెమెరాను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా (అభిషేక్ పిక్చర్స్) నిర్మించి, దర్శకత్వం వహించారు.