»Formation Of 19 New Districts In Rajasthan Revealed By Cm Gehlot
CM Ashok Gehlot : రాజస్థాన్లో 19 కొత్త జిల్లాల ఏర్పాటు.. వెల్లడించిన సీఎం గెహ్లాట్
రాజస్థాన్లో (Rajasthan) మరో 19 నూతన జిల్లాల ఏర్పాటు చేస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) అసెంబ్లీలో వెల్లడించారు. దీంతో రాజస్థాన్లోని జిల్లాల సంఖ్య 50కి చేరబోతుంది. ప్రస్తుతం రాజస్థాన్లో 33 జిల్లాలున్నాయి.అయితే, వీటిలో జైపూర్,(Jaipur) జోధ్పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది.
రాజస్థాన్లో (Rajasthan) మరో 19 నూతన జిల్లాల ఏర్పాటు చేస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అసెంబ్లీలో వెల్లడించారు. దీంతో రాజస్థాన్లోని జిల్లాల సంఖ్య 50కి చేరబోతుంది. ప్రస్తుతం రాజస్థాన్లో 33 జిల్లాలున్నాయి.అయితే, వీటిలో జైపూర్,(Jaipur) జోధ్పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది. చాలా కాలంగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల నుంచి అనేక వినతులు వస్తున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు .
కొత్త జిల్లాల ఏర్పాటుపై(Creation of new districts) ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు, వారి నుంచి నివేదిక అందినట్లు సీఎం చెప్పారు. దీని ఆధారంగా మరో 19 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే మరో మూడు డివిజన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో డివిజన్ల (divisions) సంఖ్య పదికి చేరబోతుంది. త్వరలో రాజస్థాన్లో(Rajasthan) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జిల్లాల ఏర్పాటు స్థానిక రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.