ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. 20ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన సంఘటన అందరినీ కలచి వేసింది. కాగా.. ఈ ఘటనపై తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.తాగిన మత్తులో యువతిని కారుతో ఢీకొట్టి మృతదేహాన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. వారి వారి ఇళ్ల నుంచే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.