»Aap To Assam Arvind Kejriwal Next Target Assam Political Rally Held At Guwahati
Arvind Kejriwal మూడో రాష్ట్రంపై కేజ్రీవాల్ కన్ను.. 2026 కోసం ఇప్పటి నుంచే వ్యూహం
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఆప్ రెండు స్థానాలు సంపాదించకుంది. ఓటింగ్ శాతం భారీగా వచ్చింది. దీంతో ఆప్ హవా మొదలైంది. పంజాబ్ లో వ్యవహరించిన మాదిరి అక్కడ కేజ్రీవాల్ వ్యూహం రచిస్తున్నాడు. చాపకింద నీరులా పార్టీని విస్తృతం చేస్తున్నారు.
అవినీతి పోరులో లోక్ పాల్ బిల్లు (Lokpal Bill) సాధన కోసం జరిగిన భారీ ఉద్యమంలో పాల్గొని అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అనూహ్యంగా భారత రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. కేవలం పది, పదిహేను సంవత్సరాలలోనే రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని (Aam Aadmi Party-AAP) అధికారంలోకి తీసుకురావడమంటే అది సాధారణ విషయం కాదు. తాజాగా మరో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేజ్రీవాల్ వ్యూహం రచిస్తున్నాడు. గతేడాది పంజాబ్ ఎన్నికల్లో (Punjab) అనూహ్య విజయం సాధించి జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపారు. కాంగ్రెస్, బీజేపీని తుత్తునియలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ అధికారంలో నిలబెట్టారు. ఇప్పుడు ఆయన కన్ను అస్సాంపై (Assam) పడింది. బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు.
ఇదే లక్ష్యంతో ఆదివారం అస్సాంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటించారు. పార్టీ కార్యవర్గంతో సమావేశమై సమాలోచనలు చేశారు. 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టింది. ఇటీవల గువాహటి (Guwahati) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఆప్ రెండు స్థానాలు సంపాదించకుంది. ఓటింగ్ శాతం భారీగా వచ్చింది. దీంతో ఆప్ హవా మొదలైంది. పంజాబ్ లో వ్యవహరించిన మాదిరి అక్కడ కేజ్రీవాల్ వ్యూహం రచిస్తున్నాడు. చాపకింద నీరులా పార్టీని విస్తృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం భారీ బహిరంగ నిర్వహించాడు. అధికారంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా కేజ్రీవాల్ విమర్శలు చేశాడు. అవినీతి ప్రభుత్వమైన బీజేపీని తొలగించాలని అసోం ప్రజలకు పిలుపునిచ్చాడు.
బహిరంగ సభలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఏడేళ్ల పాలనలో మేము ఢిల్లీ ముఖచిత్రాన్నే మార్చివేశాం. దాదాపు అంతే సమయం ఇక్కడ బీజేపీకి ఇస్తే హిమంత బాబు (అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ) ఏం చేశారు? ఏమీ చేయలేదు. కేవలం దరిద్రపు రాజకీయాలు తప్ప (డర్టీ పాలిటిక్స్). ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం ఆయన అస్సాం పర్యటించారు. ఈ సందర్భంగా గుహవాటిలో నిర్వహించిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘అస్సాం ప్రజలు అధికారం ఇస్తే ఉచిత విద్యుత్, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఏడు సంవత్సరాలలో తమ ప్రభుత్వం 12 లక్షల మందికి ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు. పంజాబ్ లో ఏడాది కాలంలోనే 28 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాము అస్సాంలో అధిాకరంలోకి వస్తే మాత్రం ఏడాది సమయంలోనే గువాహటిలో ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీరు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి భార్య ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తుంటే.. ఇక ప్రభుత్వ పాఠశాలలు ఎలా బాగుపడతాయని ఆశిస్తామని ప్రశ్నించారు. నాపై కేసులు పెడతానని, జైలులో వేయిస్తామని బెదిరిస్తున్న సీఎం హిమంత బిశ్వశర్మకు అతిథులను గౌరవించే అస్సాం సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. అదే ఢిల్లీకి హిమంత వస్తే నేను ఆతిథ్యం ఇస్తా’ అని తెలిపారు. ఈ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉన్నాడు.
हमारा देश महान है, लोग महान हैं
21वीं सदी में भारत जैसे देश के प्रधानमंत्री पढ़े लिखे होने चाहिए
अपनी गरीबी की वजह से कोई पढ़ा लिखा हो तो कुछ नहीं कर सकते—पर प्रधानमंत्री तो पढ़ा-लिखा होना चहिए।