»A Man Of Indian Origin Who Gives Drugs To Women And Does Not Stop Is Dangerous
మహిళలకు డ్రగ్స్ ఇచ్చి ఆ పని … భారత సంతతి వ్యక్తి ఘాతుకం
ఆస్ట్రేలియా(Australia)లో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాక అత్యాచార దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.
జాబ్స్ పేరుతో యువతులపై అత్యాచారాలకు పాల్పడిన కేసులో ఆస్ట్రేలియా(Australia)లోని భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యక్తిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇటీవలి కాలంలో సిడ్నీ చరిత్రలోనే ‘వరస్ట్ రేపిస్ట్’గా బాలేశ్ దన్‌ఖర్‌ను కోర్టు అభివర్ణించింది. రాజకీయాలతో అనుబంధం ఉన్న నిందితుడు.. ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియన్ మహిళలకు ఎర వేసి, డ్రగ్స్ ఇచ్చి అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడినట్టు సిడ్నీ డౌనింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జ్యూరీ సోమవారం నిర్దారణకు వచ్చినట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. ఆస్ట్రేలియా(Australia)లోని భారత సంతతి కమ్యూనిటీలో భలేశ్ ధన్‌ఖడ్(Balesh Dhankhar) పేరున్న వ్యక్తి. గతంలో అతడు అక్కడ ఇండియాకు చెందిన ఓ రాజకీయ పార్టీ కోసం పనిచేశాడు. కొరియన్ సినిమాలు, భాష, మహిళల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ క్రమంలోనే 2017లో కొరియన్ ట్రాన్స్‌లేట్ కావాలంటూ ఒక నకిలీ ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు.
అక్కడి నుంచి అతడి దారుణాలు ప్రారంభమయ్యాయి. ఒంటరిగా, కొత్తగా సిడ్నీ(Sydney)కి వచ్చిన వారిని, ఉద్యోగం అవసరమైన యువతులకు మాయమాటలు చెప్పి గాలం వేశాడు. మొదట వారిని ఓ హోటల్(Hotel)లో ఇంటర్వ్యూ చేసేవాడు. వారితో జరిగిన ప్రతి మాటలను రికార్డు చేసేవాడు. ఆ తర్వాత డిన్నర్ కోసం రావాలంటూ ఒత్తిడి చేసేవాడు. అలా వచ్చిన వారికి డ్రగ్స్ కలిపిన వైన్, ఐస్‌క్రీం ఇచ్చేవాడు. అలా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వారిపై అత్యాచారానికి ఒడిగట్టేవాడు. ఆ దృశ్యాలను రికార్డు చేసేవాడు. బెడ్‌సైడ్ అలారం క్లాక్, ఫోన్ కెమెరాల్లో అవి రికార్డయ్యేవి. 2018లో పోలీసులు అతడి అపార్ట్మెంట్(Apartment)లో సోదాలు నిర్వహించగా.. పదుల సంఖ్యలో ఈ వీడియోలు బయటపడ్డాయి. వాటిలో కొందరు యువతులు అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే వాటిని దాచి పెట్టిన ఫోల్డర్లకు కొరియన్ మహిళలపేర్లు పెట్టాడు. ఇలా ఐదుగురు కొరియన్ మహిళల(Korean woman)పై లైంగిక దాడికి పాల్పడిన అతడిని సిడ్నీలోని జిల్లా కోర్టు దోషిగా తేల్చింది.