ఇవాళ అర్ధరాత్రి నుంచి OTTలోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘డిమోంటి కాలనీ 2’, శోభిత ధూళిపాళ నటించిన ‘లవ్, సితార’ జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి. నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి 2’ ఆహాలో అందుబాటులోకి రాబోతుంది. ఇక ఇప్పటికే నాని ‘సరిపోదా శనివారం’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. శ్రద్ధా కపూర్ ‘స్త్రీ2’ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.