Pooja Hegde: పాపం పూజా.. పవన్ కూడా హ్యాండ్ ఇచ్చాడు?
బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి చూస్తే.. అయ్యో పాపం అనిపించక మానదు. అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. ఉన్న ఆఫర్లు కూడా పొగొట్టుకుంటోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చేశాడు. దీంతో పూజా పరిస్థింతేటనేది హాట్ టాపిక్‌గా మారింది.
Pooja Hegde affair with cricketer? Trivikram another chance?
బుట్టబొమ్మకు వరుస ఆఫర్లు వచ్చినా సరైన హిట్ మాత్రం అందుకోలేదు. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసికా భాయ్ కిసికా జాన్ సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. అయితే హ్యాట్రిక్ ఫ్లాపులే అనుకుంటే పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి మధ్యలోనే డ్రాప్ అయిపోయింది. ఏం జరిగిందో ఏమోగానీ.. షూటింగ్ మధ్యలో నుంచే పూజను తప్పించారు మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమాలో ముందు నుంచి పూజాహెగ్డేనే హీరోయిన్గా అనుకున్నారు. కానీ శ్రీలీలను మెయిన్ హీరోయిన్గా తీసుకొని షాక్ ఇచ్చాడు హరీష్ శంకర్. పోనీ మరో హీరోయిన్గా అయినా పూజను తీసుకుంటారనుకుంటే.. తాజాగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యను సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. దీంతో పూజా ఆశలు పెట్టుకున్న ఒక్క ప్రాజెక్ట్ కూడా చేజారిపోయినట్టే.
అసలు ఈ బుట్టబొమ్మను స్టార్ హీరోలు ఎందుకు పక్కకు పెడుతున్నారనేదే ఇప్పుడు అంతుపట్టకుండా ఉంది. అది కూడా పవన్, మహేష్ లాంటి హీరోలంటే ఇక పూజా పనైపోయినట్టేనని చెప్పాలి. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ కమర్షియల్‌గా మాత్రం దూసుకుపోతోంది. వరుస యాడ్లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో సందడి చేస్తోంది. ఏదేమైనా పూజా పరిస్థితేంటో ఆమెకే తెలియాలి.