బహుశా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైం హీరోయిన్ లేకుండా చేస్తున్న చిత్రం గాడ్ ఫాదరే కావచ్చు. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ నయనతార నటిస్తున్నప్పటికీ.. చిరు చెల్లెలి పాత్రలో కనిపించనుంది. దాంతో గాడ్ ఫాదర్‌కు గ్లామర్ టచ్ లేదనే చెప్పాలి. పైగా హీరో క్యారెక్టర్ అలాంటిది కాబట్టి.. సినిమా చూస్తున్నంత సేపు హీరోయిన్ ప్రస్థావన వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వాస్తవానికి కూడా మళయాళ ఒరిజినల్ వెర్షన్ ‘లూసిఫర్’లో హీరో పాత్రకు హీరోయిన్ ఉండదు. అయినా ఆ లోటును తీర్చబోతున్నారట మెగాస్టార్. అందుకోసం బింబిసార బ్యూటీతో చిందులేయనున్నాడని తెలుస్తోంది.
మార్పులు, చేర్పుల్లో భాగంగా గాడ్ ఫాదర్లో ఓ ఐటెం సాంగ్ ను యాడ్ చేశారట. ఇందులో బింబిసార ఐటెం సాంగ్‌లో కనిపించిన వరినా హుస్సేన్ మెగాస్టార్‌తో స్టెప్పులేసిందట. బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ అయిప్పటికీ ఐటెం సాంగ్ మాత్రం అంత పాపులర్ కాలేదు. దాంతో అందులో నటించిన ఈ బ్యూటీ కూడా పెద్ద రిజిష్టర్ అవలేదు. అలాంటి ఈ ముద్దుగుమ్మను గాడ్ ఫాదర్లో తీసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఐటెం సాంగ్‌ని అప్పటికప్పుడు ప్లాన్ చేయడం వల్ల.. ఈమెను తీసుకున్నట్టు టాక్. ఇక ఈ ఒక్క పాట కోసమే కొటికి పైగా ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఐటెం సాంగ్ విజువల్స్‌తో పాటు తమన్ ట్యూన్ కూడా అదిరిపోయేలా ఉంటుందని టాక్. మరి భారీగా ఖర్చు చేసిన ఈ ఐటెం సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.