ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్‌ను జనవరి 12 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక మెగాస్టార్ 154 ప్రాజెక్ట్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ డేట్ మాత్రం లాక్ చేయలేదు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయినా ఇప్పుడు ఇదే సంస్థ.. బాలయ్య 107వ సినిమాను సైతం సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 107 టైటిల్‌ను.. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర భారీ ఎత్తున ఎనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా వీరసింహా రెడ్డి(veera simha reddy) పై రెట్టింపు అంచనాలు పెట్టుకోండని.. సంక్రాంతికి రావడం పక్కా అని చెప్పుకొచ్చాడు గోపీచంద్ మలినేని. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఇక్కడే అసలు మ్యాటర్ ఉందని చెప్పొచ్చు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య(waltair veeraiah) రెండు సినిమాల నిర్మాతలు ఒకరే కాబట్టి.. సంక్రాంతికి రిలీజ్ చేస్తే కలెక్షన్లను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక దాన్ని పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా.. హైప్ కోసమే సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించారని చెప్పొచ్చు.
తీరా సమయం దగ్గర పడ్డాక.. పోస్ట్ ప్రొడక్షన్ పేరుతో పోస్ట్‌పోన్ చేయడం కొత్తేం కాదు. అయినా కూడా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మెగా154 టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సి ఉంది. ఒకవేళ నిర్మాణ సంస్థ రిస్క్ చేసి రిలీజ్ చేస్తే మాత్రం.. అన్ని రకాలుగా ‘వాల్తేరు వీరయ్య’ వర్సెస్ ‘వీర సింహా రెడ్డి’ వార్ పీక్స్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే మెగా వర్సెస్ నందమూరి వార్ మొదలైపోయింది. మరి ఈ సీనియర్ హీరోల్లో ఎవరో ఒకరు తగ్గుతారా.. లేదంటే పోటీకి సై అంటారో చూడాలి.