Urvashi Rautela: మొన్న బల్లి నక్లెస్.. నేడు ఈకల డ్రెస్సులో ఊర్వశి..!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడంలో ముందుంటారు. ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందిపెడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. మొదటిరోజు పింక్ కలర్ గౌన్ లో మురిపించింది. ఆ సమయంలో ఆమె బల్లి నక్లెస్ తో భయపెట్టింది. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ ని కాపీ కొట్టింది. తాజాగా ఈకల డ్రెస్సు ధరించింది.
కేన్స్ రెడ్ కార్పెట్ పై వరుసగా నాలుగు సార్లు హొయలు ఒలికించిన ఊర్వశి రౌతెలా మొదటి సారి పింక్ కలర్ గౌన్ తో కన్నుల విందు చేసింది. ఆ తర్వాత వైట్ అండ్ బ్లూ కలర్ గౌన్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈసారి గ్రీన్ కలర్ ఫీదర్ డ్రెస్సులో ఈ అమ్మడు రెడ్ కార్పెట్ పై కనిపించి అలరించింది. ఫీనిక్స్ పక్షిలా డ్రెస్ ను ధరించిన ఊర్వశి సర్ ప్రైజ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన వారంతా ఈ ఈకల డ్రెస్ ఏంటి పాపా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రెక్కల ఆకారంలో ఉన్న ఒక విభిన్నమైన ఔట్ ఫిట్ ను ధరించిన ఈ అమ్మడి గురించి సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ అమ్మడి యొక్క ఔట్ ఫిట్ ను కొందరు ప్రశంసిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇదెక్కడి అవతారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెక్ కి ఏమీ లేకుండా.. చెవులకు విభిన్నమైన ఇయర్ రింగ్స్ ను ధరించి నెత్తిన కూడా గ్రీన్ కలర్ ఫెదర్ క్యాప్ ను ధరించిన ఊర్వశి రౌతేలా మీడియా కెమెరా మెన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇటీవల చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య, అఖిల్ ఏంజెట్ చిత్రాలలో ఐటెం సాంగులు చేసి అలరించింది.