»Tripti Dimri Chance For Tripti With Bunny Trouble For Rashmika Again
Tripti Dimri: బన్నీతో త్రిప్తికి ఛాన్స్.. మళ్లీ రష్మికకే ఇబ్బంది?
ఇండస్ట్రీలో ఎన్ని రోజులు వెయిట్ చేసినా.. ఒక్క సినిమా పడితే చాలు కెరీర్ సెట్ అయిపోతుంది. క్యూట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి విషయంలోను ఇదే జరిగింది. అనిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి.
Tripti Dimri: అనిమల్ సినిమాలో త్రిప్తి డిమ్రి చేసింది చిన్న పాత్రే అయినా.. దాని ఇంపాక్ట్ పాన్ ఇండియా లెవల్లో ఉంది. ఏకంగా రష్మికను సైతం డామినేట్ చేసేసింది త్రిప్తి. ఈ విషయంలో రష్మిక కాస్త అప్సెట్ అయిందననే చెప్పాలి. అనిమల్ సినిమా సెకండాఫ్‌లో వచ్చే బాబీ 2 పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రి.. కుర్రాళ్ల హాట్ కేక్ అయిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు కుర్రాళ్లు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. త్రిప్తి కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఆఫర్లు కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో బడా ఆఫర్స్ అందుకుంటోంది.
ఏకంగా ప్రభాస్ స్పిరిట్లోను ఛాన్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం బన్నీతో బంపర్ ఆఫర్ అందుకున్నట్టుగా సమాచారం. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2లో ఓ కీలక పాత్ర కోసం త్రిప్తిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పుష్పరాజ్ అనుచరుడిని ట్రాప్ చేసే పాత్రలో త్రిప్తి నటించనుందట. ఇప్పటికే త్రిప్తిని సుకుమార్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె పాత్ర చిన్నదే అయినా.. దాని ఎఫెక్ట్ సినిమాపై గట్టిగా ఉంటుందట. ముఖ్యంగా.. బన్నీ, త్రిప్తి కాంబోలో వచ్చే సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయట.
త్వరలోనే త్రిప్తి.. పుష్ప 2 సెట్స్‌లో జాయిన్ అవనుందని సమాచారం. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. అనిమల్ సినిమాలో రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకున్న త్రిప్తి.. ఇప్పుడు మరోసారి రష్మికతోనే స్క్రీన్ షేరింగ్‌కు రెడీ అవుతుండడం విశేషం. దీంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్గా మారింది. అంతేకాదు.. మరోసారి బాబీ 2 రష్మికను డామినేట్ చేస్తుందా? రష్మికకు త్రిప్తి ఇబ్బందికరంగా మారుతుందా? అనేది మరింత ఆసక్తికరంగా మారింది.