ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్ ఈ రెండు సినిమాల జానర్ వేరు. ఆర్ఆర్ఆర్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కగా.. ఆదిపురుష్ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. అయినా ఈ రెండు సినిమాల్లో రాముడు లుక్ కామన్ పాయింట్‌గా ఉంది. ఆర్ఆర్ఆర్లో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించాడు. దాంతో ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్‌లో రామారాజుగా కనిపించాడు చరణ్. అందుకే ఇప్పుడు చరణ్ అల్లూరి లుక్‌తో.. ఆదిపురుష్ లుక్‌ను పోలుస్తున్నారు కొందరు అభిమానులు. ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో.. పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టిన రాముడిగా కనిపించాడు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ.. ఇంకా ఆదిపురుష్ పోస్టర్‌ను ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.
అయితే ఇదే సమయంలో ప్రభాస్, చరణ్ విల్లు ఎక్కుపెట్టిన రెండు పోస్టర్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. రాముడిగా చరణ్ లుక్ బాగుందని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తుండగా.. ఆదిపురుష్‌లో రియల్ రాముడిగా నటిస్తున్న ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉందని.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం ట్విట్టర్లో ఇదే ట్రెండింగ్ టాక్‌గా మారింది. అయితే అసలు ఆదిపురుష్ కంటెంట్‌కు.. ఆర్ఆర్ఆర్ కథకు సంబంధమే లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం జస్ట్ పోస్లర్లలతో ఇలా రచ్చ రచ్చ చేయడం విశేషం. అయితే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యాక ఇది మరింత ట్రెండ్ అయ్యేలానే కనిపిస్తోంది. అయినా అభిమానుల్లో ఇలాంటి చర్చ కొత్తేం కాదులేండి.