కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా రిలీజ్ అయితే తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ చేయలేకపోయాడు సూర్య. కానీ తాజాగా భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Telugu director: ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకున్నాడు సూర్య. ఆ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత థియేటర్లో రిలీజ్ అయిన ET మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో కంగువ మూవీ చేస్తున్నాడు సూర్య. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏకంగా పది భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కంగువ గ్లింప్స్ అదిరిపోయింది. దాంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు సూర్య. అలాగే వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోను సినిమాలు కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు తెలుగు డైరెక్టర్‌తో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటితో సూర్య భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడట. ప్రస్తుతం నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు చందు మొండేటి. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ మూవీ తర్వాత సూర్యతో ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మైథాలజీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కథను సిద్ధం చేశాడట. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టనుందని అంటున్నారు. సూర్య చేయబోయే ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ ఇదేనని చెప్పొచ్చు. ఇప్పటికే ధనుష్, శివ కార్తికేయన్ లాంటి హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు సూర్య కూడా తెలుగు బాట పట్టనున్నాడు.