ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ RRR ఎంత భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఇప్పుడు వివిధ దేశాల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 21న జపాన్‌లో ఆర్ఆర్ఆర్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli) ఆర్ఆర్ఆర్ జపాన్ వెర్షన్‌ను గట్టిగానే ప్రమోట్ చేశారు. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ప్రమోషన్లో భాగంగా వీడియో గేమ్స్ క్రియేటర్ హిడియో కోజిమాను కలిశాడు రాజమౌళి. ఈ సందర్భంగా తీసిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు జక్కన్న. ‘లెజెండరీ వీడియో గేమ్ క్రియేటర్ కోజిమోను కలవడం సంతోషంగా ఉంది.. అలాగే గౌరవంగా భావిస్తున్నాను. ఆయనతో వీడియో గేమ్స్, సినిమాలతో పాటు పలు విషయాల గురించి అతడితో మాట్లాడాను. ఈ మెమొరీస్ ఎప్పటికీ నిలిచిపోతాయి..’ అని ట్వీట్ చేశారు రాజమౌళి.
కోజిమా సైతం ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాజమౌళి కోజిమా ప్రొడక్షన్స్ స్టూడియోని సందర్శించారని.. ఆ స్టూడియోలో 3Dలో రాజమౌళిని స్కాన్ చేసిన ఫోటోలను షేర్ చేశాడు. దాంతో త్వరలోనే రాజమౌళి కూడా వీడియో గేమ్స్‌లో కనిపించబోతున్నారని చెప్పొచ్చు. మామూలుగా రాజమౌళి క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఆయనతో వీడియో గేమ్ అంటే.. అది చాలా పాపులర్ అవుతుందని చెప్పొచ్చు. మరి నిజంగానే రాజమౌళి వీడియో గేమ్ వస్తుందేమో చూడాలి.