Sandeep Reddy Vanga will do a film with Chiranjeevi
Sandeep Reddy Vanga: యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) అంటే ఏంటో తెలిసి వచ్చింది. తెలుగులోనే గాక.. బాలీవుడ్లో కూడా తాను ఏంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక సందీప్ (Sandeep) మూవీ అంటే మాములు హైప్ క్రియేట్ కాలేదు. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రణబీర్ కపూర్ మరోసారి అతనితోనే సినిమా చేస్తానని చెప్పారు. రాజమౌళి కాదని చెప్పడం విశేషం. బాలకృష్ణ నిర్వహించిన ఆన్ స్టాపబుల్ షోలో కూడా సందీప్ నెక్ట్స్ మూవీ స్పిరిట్లో తనకు చిన్న రోల్ ఇవ్వాలని అడిగిన సంగతి తెలిసిందే.
యానిమల్ తర్వాత.. యానిమల్ పార్క్ అని మూవీలో సందీప్ (Sandeep) రివీల్ చేశాడు. కానీ ఆ సినిమా చేసే ఛాన్స్ లేదు. యానిమల్ ఇంత బీభత్సంగా ఉంటే.. యానిమల్ పార్క్ అంటే మాములుగా ఉండదు. ఇవీ గాక ప్రభాస్తో స్పిరిట్, అల్లు అర్జున్తో మరో మూవీ లైన్లో పెట్టారు. కానీ ఇంతలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తానని అంటున్నారు సందీప్ రెడ్డి. యానిమల్ మూవీ ప్రమోషన్లో భాగంగా అమెరికా వెళ్లారు. అక్కడ ప్రేక్షకులతో మాట్లాడారు. చిరంజీవితో కలిసి పనిచేయాలని ఉందని.. అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు. కానీ మూవీ ఎప్పుడూ, కథ ఏంటనే అంశానికి సంబంధించి ఇన్ఫో రివీల్ చేయలేదు.
సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు అడిగారు.. ఇష్టాయిష్టాలను తెలుసుకున్నారు. స్త్రీ ద్వేషం గురించి ఒక్కరు ప్రశ్నించలేదు. ఇక్కడ ఉన్న వాళ్లందరూ సినిమాను సినిమాలాగే చూశారు… అందుకు సంతోషంగా ఉన్నానని సందీప్ చెప్పారు.