»Mansoor Ali Khan Mansoor Who Filed A Defamation Suit On Whom
Mansoor Ali Khan: పరువు నష్టం దావా వేసిన నటుడు.. ఎవరిమీదంటే?
ఇటీవల మన్సూర్ ఆలీఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కొందరు ఆమెకు మద్దతు ఇచ్చారు. త్రిషతోపాటు ఆమెకు మద్దతుగా ఉన్న కొందరిపై ఆలీ ఖాన్ పరువు నష్టం దావా వేశారు.
Mansoor Ali Khan: తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ ఇటీవల త్రిషపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చాలా మంది నటీనటులు ఆమెకు మద్దతుగా నిలిచారు. చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా అందరూ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పేదే లేదని మన్సూర్ తేల్చి చెప్పారు. పరిస్థితులు తీవ్రంగా మారడంతో తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగంగా త్రిషకు క్షమాపణలు కోరారు. దీంతో వివాదం ముగిసింది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో మరోసారి ఈ వివాదం చెలరేగింది.
త్రిషకు క్షమాపణలు చెప్పిన తర్వాత రోజు మన్సూర్ ఆలీ ఖాన్ మీడియా ముందు మాట్లాడుతూ.. త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలకు పరువునష్టం కింద నోటీసులు పంపిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే మన్సూర్.. త్రిష, ఖుష్బూ, చిరంజీవిలపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ధనంజయ్ ద్వారా కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. తన పరువుకు భంగం కలిగించారని మన్సూర్ పేర్కొన్నారు. డిసెంబర్ 11న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.