మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా ఫెస్టివల్ టార్గెట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ఓ సినిమాకు రంగం సిద్దం అవుతుండగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. ‘ఆచార్య’ ఫ్లాప్‌తో చాలా డిసప్పాయింట్ అయ్యారు మెగా ఫ్యాన్స్. అందుకే ఈ దసరాకు మెగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చిరు. లూసీఫర్ రీమేక్‌గా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం అవి సెట్స్ పై ఉన్నాయి. వాటిలో మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళా శంకర్’ రీమేక్ మూవీ కాగా.. బాబీ దర్శకత్వంలో మెగా 154 ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. మెగా 154లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెంకటేష్ కూడా గెస్ట్ రోల్ చేయనున్నాడని టాక్. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేశారు. కాకపోతే డేట్ మాత్రం రివీల్ చేయలేదు. కానీ తాజాగా రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లోకి రాబోతున్నట్టు సమాచారం. జనవరి 12 ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ రిలీజ్ కానుంది. అందుకే ఆ నెక్ట్స్ డే మెగా 154 రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.