Ram Charan : మిగతా హీరోలు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. మెగా పవర్ స్టార్ మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. శంకర్‌తో ఆర్సీ 15 స్టార్ట్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
మిగతా హీరోలు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. మెగా పవర్ స్టార్ మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. శంకర్‌తో ఆర్సీ 15 స్టార్ట్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సెప్టెంబర్‌లో ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఆర్సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఆస్కార్ అందుకొని అమెరికా నుంచి వచ్చి రాగానే ఆర్సీ 15 షూటింగ్లో జాయిన్ అయిపోయాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. మరో పాట, ఫైట్.. కొన్ని ప్యాచ్ వర్క్‌లు మినహా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైయినట్టు సమాచారం. దాంతో ఆర్సీ 15 టైటిల్ టైం ఫిక్స్ అయిపోయింది. టైమే కాదు.. టైటిల్ కూడా దాదాపుగా ఖరారైనట్టే. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా.. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ వినిపించాయి. కానీ CEO అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది. సీఈవో అంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో ఈ టైటిల్ పర్ఫెక్ట్గా ఉండడంతో.. దీన్నే లాక్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమచారం. మరో మూడు, నాలుగు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఆర్సీ 15 రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. దీని పై కూడా చరణ్ బర్త్ డే రోజే క్లారిటీ రానుంది.