»Rashmika In A Live In Relationship With Vijay Devarakonda Photos Viral
Rashmika: విజయ్ దేవరకొండతో రష్మిక సహజీవనం..?
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల అనుబంధంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఇద్దరూ నోరువిప్పలేదు. అయితే వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారనే రూమర్స్ మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు రూమర్స్ మరో అడుగు ముందుకేసింది. రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటో విజయ్ దేవరకొండతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లకు దారితీసింది.
రష్మిక మందన్న ఇటీవల తన అసిస్టెంట్ మ్యారేజ్ కి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఓ పసుపురంగ చీర కట్టుకుంది. ఆచీరలో ఉన్న ఫోటోని తాజాగా షేర్ చేసింది. అయితే, ఆమె షేర్ చేసిన ఫోటోలో ఉన్న లొకేషన్ చూస్తే, ఎక్కడో చూసినట్లు ఉంది అనే ఫీలింగ్ నెటిజన్లకు కలిగింది. ఎక్కడా అని వెతికితే ఇంకేముంది.. ఆ లొకేషన్ లో ఆల్రెడీ విజయ్ దేవరకొండ ఫోటో దిగాడు. అది చూడగానే నెటిజన్లకు అనుమానాలు రావడం మొదలైంది. ఇంకేముంది ఆ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
వైరల్ పోస్ట్ ప్రకారం, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల సంబంధం చాలా కాలంగా కొనసాగుతోంది. పుకార్లన్నీ నిజమేనని, దీంతో ఈ జంట లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నమాట నిజమేనని తెలుస్తోంది. రష్మిక కొత్త ఇన్స్టాగ్రామ్ ఫోటో హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంటి టెర్రస్‌పై తీసింది కావడం విశేషం.
ఓ వార్త ప్రకారం, వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని విజయ్ ఇటీవల చెప్పాడు. అతను సమీప భవిష్యత్తులో తనను తాను వివాహితుడిగా చూస్తున్నానని అతను అంగీకరించాడు. అయితే భాగస్వామి విషయంలో మాత్రం నోరు మెదపలేదు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ రిలేషన్ షిప్ పుకార్ల కోసం తరచుగా వార్తల్లో ఉంటారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో కలిసి నటించినప్పటి నుంచి వీరి మధ్య కెమిస్ట్రీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.