»Randeep Hooda Enters Into Wedlock With Lin Laishram
Randeep Hooda: పెళ్లి పీటలు ఎక్కిన రణదీప్ హుడా
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా(47)(Randeep Hooda) తన ప్రేయసి లిన్ లైష్రామ్‌ను బుధవారం వివాహం చేసుకున్నారు. మణిపూర్‌లోని ఇంపాల్(Imphal West)లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.
Randeep Hooda enters into wedlock with Lin Laishram
బాలీవుడ్ ప్రముఖ హీరో రణదీప్ హుడా(47)(Randeep Hooda) ఎట్టకేలకు తన ప్రియురాలు లిన్ లైష్రామ్(Lin Laishram)ని బుధవారం మనువాడారు. దీంతో రణదీప్, లిన్ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మణిపురి సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. వధూవరులు ధరించిన దుస్తులు చాలా బాగున్నాయి. పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ అందంగా కనిపిస్తున్నారు. లిన్‌ను మండపం వద్దకు తీసుకురావడం, ఆమె నడిచే విధానం, రణదీప్పై పూలు జల్లి ఆయనకు నమస్కరించి ఆయన మెడలో మల్లెమాల వేయడం ఇవన్నీ సోషల్ మీడియాలో చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వరుడి చుట్టూ ప్రదక్షణలు చేసిన తరవాత లిన్.. ఆయన మెడలో పూల మాల వేసి నమస్కరించారు. అనంతరం వరుడి పక్కన వధువును కూర్చోబెట్టారు. ఆ తరవాత వధువు మెడలో రణదీప్ మల్లెమాల వేశారు.
మీడియాతో ఒక ఇంటరాక్షన్‌లో రణదీప్ వారి ప్రేమకథ(love story) గురించి పంచుకున్నాడు. ఇక్కడికి రావడం, వధువు సంప్రదాయం ప్రకారం పెళ్లచేసుకోబోతుండడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. పెళ్లి వేడుకలో పాల్గొని తన జీవిత భాగస్వామి సంప్రదాయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వేచి చూస్తున్నానని చెప్పారు. ఈ పెళ్లి వేడుకలో తాను ఎలాంటి తప్పులు చేయకూడదని ఆశిస్తున్నానని సరదాగా అన్నారు.
జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న తనకు రెండే కోరికలు ఉన్నాయని.. ఒకటి ఎక్కువ మంది పిల్లలు(children), రెండు సుఖసంతోషాలు జీవించడం అని రణదీప్ తెలిపారు. లిన్, స్నేహితుల నుంచి జీవిత భాగస్వాముల వరకు వారి ప్రయాణం గురించి గుర్తుచేసుకుంటూ, వారు మొదట నసీరుద్దీన్ షా మోట్లీ థియేటర్ గ్రూప్‌లో కలుసుకున్నారని వెల్లడించారు. వారి స్నేహం చిరస్మరణీయ ప్రయాణానికి వేదికగా నిలిచి అందమైన బంధంగా మారింది.