Allu Arjun: అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తున్నాడా..?
రణబీర్ కపూర్ యానిమల్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లలో వేగం పెంచారు. సందీప్ రెడ్డి వంగా, సోదరుడు ప్రణయ్ సినిమా ప్రమోషన్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తమ్ముడు ప్రణయ్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్‌తో ‘స్పిరిట్’కి కథ ఖరారైందని వెల్లడించారు. కథకు సంబంధించిన ట్రీట్మెంట్ పెండింగ్‌లో ఉందని, అది రెండు నెలల తర్వాత ప్రారంభమవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 2024లో షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా ప్రకటించారు. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ వంగా, అల్లు అర్జున్ సినిమా కూడా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి కథ లేదని ప్రణయ్ వెల్లడించాడు. అల్లు అర్జున్, సందీప్ ఇద్దరూ ఫైనల్ కథ లేకుండా పనిచేయడానికి అంగీకరించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పుష్ప2, త్రివిక్రమ్ సినిమాలున్నాయి.
కథ లేకుండా సినిమా అనౌన్స్ చేయడం వెనక అల్లు అర్జున్‌కి సందీప్ రెడ్డి వంగా మీద పూర్తి నమ్మకం ఉందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుకుమార్‌తో పుష్ప కోసం అదే చేశాడు. అల్లు అర్జున్‌కి తన దర్శకులపై పూర్తి నమ్మకం ఉందని ప్రణవ్ అన్నారు. సినిమా బాగుంటే పర్వాలేదు. కానీ కథ ఏదైనా తేడా కొడితే ఏకంగా సినిమా ఫలితం మీదే ఎఫెక్ట్ పడుతుంది. అల్లు అర్జున్ మరీ గుడ్డిగా ఈ డైరెక్టర్ ని నమ్మేస్తున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇకపోతే యానిమల్ మూవీ విషయానికి వస్తే ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఇది ఒక బాలీవుడ్ చిత్రం కోసం అనేక ఓపెనింగ్ డే రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్ నటించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మించింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.