Sam Acting In Family Man Series Is Amazing:Naga Chaitanya
Naga Chaitanya: నాగచైతన్య- సమంత మధ్య విభేదాలకు కారణం.. ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్. అందులో సమంత బోల్డ్‌గా నటించడంతో.. చైతు సహా ఫ్యామిలీ మొత్తం గుర్రుమంది. ఆ వెంటనే విడిపోవడం కూడా జరిగింది. ఇది గతం.. ఇప్పుడు చైతు స్వరం మారింది. అవును ఆ సిరీస్‌లో సమంత అద్భుతంగా నటించిందని చెబుతున్నారు.
చైతు (Naga Chaitanya) తొలిసారి దూత అనే వెబ్ సిరీస్ చేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవనుంది. తండేల్ అనే మూవీ కూడా నటిస్తున్నారు. ధూత వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో సమంత ఫ్యామిలీ మేన్ సిరీస్ గురించి మాట్లాడారు. అందులో సమంత నటన బాగుందని కామెంట్ చేశారు.
అది ఒక్కటే కాదు.. తన మూవీస్ ఫ్లాప్ కావడానికి గల కారణం కూడా వివరించారు. ఓటమి నుంచి పలు విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గురువు, పేరంట్స్, ఫ్రెండ్స్ చెప్పని విషయాలు ఓటమి ద్వారా తెలుస్తాయని చెప్పారు. మూవీ ఫెయిల్ అయితే.. అందుకు గల కారణాలను విశ్లేషించుకుని.. తర్వాత ప్రాజెక్టుకు సిద్ధం అవుతానని చెప్పారు. మూవీ/ సిరీస్ జయపజయాలు ప్రేక్షకుల చేతుల్లో ఉంటాయని చైతు అంటున్నారు. ఇటీవల తాను చేసిన తాల్ సింగ్ చద్దా హిట్ అవుతుందని భావించామని.. కానీ నిరాశ పరిచిందని వివరించారు.