»Animals Hype Is Affecting Upcoming Telugu Releases
ANIMAL: యానిమల్ మూవీ ఆ సినిమాలపై ఎఫెక్ట్ చూపనుందా..?
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నిజానికి ఎప్పుడో ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా వాయదా పడుతూ ఇప్పటికి విడుదలకు రెడీ అయింది. కాగా,
యానిమల్ మూవీ బాలీవుడ్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో భారీ బజ్ సృష్టించగలిగింది. ఇటీవల జరిగిన ఈవెంట్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, SS రాజమౌళి రావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ట్రైలర్ ని లూప్ లో చూసి ఆనందించిన వారు కూడా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్.. ఇతర తెలుగు సినిమాలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపనున్నట్లు తెలుస్తోంది.
హాయ్ నాన్నా, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ప్రమోషనల్ కంటెంట్‌పై యానిమల్ క్రేజ్ నేరుగా ప్రభావం చూపుతోంది. యానిమల్ ట్రైలర్ టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇది తెలుగు స్ట్రెయిట్ చిత్రాల కంటే ఎక్కువ క్రేజ్‌తో ఎక్కువ అంచనాలు ఉన్న చిత్రంగా మారింది. యానిమల్ రిలీజ్ వల్ల రెండు తెలుగు చిత్రాలపై ప్రభావం పడనుంది. అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో హాయ్ నాన్న, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ కంటే యానిమల్కు భారీ ఓపెనింగ్స్ లభించనున్నాయి. దూకుడుగా ప్రమోషన్స్ చేస్తూ బజ్ క్రియేట్ చేసేందుకు ఈ రెండు సినిమాల టీంలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా నాని తన సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. గత కొన్ని వారాలుగా నిరంతరంగా సినిమా ప్రమోట్ చేస్తున్నాడు. మౌత్ టాక్ రిలీజ్ తర్వాత కలెక్షన్స్ ని డిసైడ్ చేస్తుంది. కానీ ఏ సినిమాకైనా ప్రేక్షకుల ఎదురుచూపులు చాలా ముఖ్యం. ఈ అంశంలో సందీప్ రెడ్డి వంగా తన యానిమల్ మూవీతో ముందున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్నా, నితిన్ మూవీలు ఉన్నాయి.