»Pushpa 2 Not A Fair Is This The Highlight Of Pushpa 2
Pushpa 2: జాతర కాదు.. ‘పుష్ప 2’లో ఇదే హైలెట్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. అయితే.. ఇప్పటి వరకు జాతర ఎపిసోడ్ ఈ సినిమాలో హైలెట్‌గా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు అంతకుమించిన ఎపిసోడ్ ఒకటి ఉంటుదని తెలుస్తోంది.
Pushpa 2: Not a fair.. Is this the highlight of 'Pushpa 2'?
Pushpa 2: పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ చేయబోయే మాస్ జాతరకు థియేటర్లు దద్దరిల్లిపోతాయని.. రీసెంట్గా వచ్చిన టీజర్‌తోనే చెప్పేశాడు సుకుమార్. గంగమ్మ తల్లీ జాతరలో పుష్పరాజ్ చేసే ఊచకోత.. ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించడం గ్యారెంటీ. అమ్మవారి గెటప్‌లో బన్నీ చేసే విధ్వంసం మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ కూడా చెబుతోంది. అందుకే.. టీజర్లో కేవలం జాతర సెటప్‌నే హైలెట్ చేశారు. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందని అంటున్నారు.
జాతర సెటప్ కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు జాతర కాదు, అంతకుమించిన మరో ఎపిసోడ్ పుష్ప2లో ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఓ అండర్ వాటర్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందట. థియేటర్లో ఆడియెన్స్ ఊపిరి బిగపట్టి చూసేలా.. ఈ ఫైట్ ఉంటుందని ఇండస్డ్రీ వర్గాల ఇన్సైడ్ టాక్. ఇలాంటి సీక్వెన్స్ తెలుగు సినిమాల్లో ఇంతవరకూ రాలేదన్నట్టుగా.. ఈ అండర్ వాటర్ ఫైట్ ఉండనుందట. అలాగే.. ఇందులో బన్నీ నట విశ్వరూపం చూస్తారని అంటున్నారు.
ప్రస్తుతం ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. ఈ సినిమాను ఊహించని విధంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆగష్టు 15న పుష్ప2 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఏదేమైనా.. రోజు రోజుకి ఈ సినిమా పై అంచనాలు పెరుగుతునేఊ ఉన్నాయి.