Rana Naidu-2 వస్తోంది.. కానీ ఆ కంటెంట్ అంత ఉండదంటోన్న వెంకీ
రానా నాయుడు2 వెబ్ సిరీస్ వస్తోందని.. అందులో న్యూడిటీ తగ్గించామని విక్టరీ వెంకటేశ్ తెలిపారు. నెటిప్లిక్స్తోపాటు అమెజాన్ కూడా తన కోసం కథలను సిద్ధం చేసుకుంటుందని పేర్కొన్నారు. బొబ్బలిరాజా మూవీకి సీక్వెల్ చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టారు.
Rana Naidu-2: వెంకటేష్ (venkatesh) విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు సక్సెస్ రేట్ ఉన్న హీరో.. అలాగే నిర్మాతల హీరో అంటారు. మూవీకి ఇంత కావాలని ఏ రోజు డిమాండ్ చేయలేదట. ఆయన కొత్త మూవీ సైంధవ్ టీజర్ విడుదలైంది. మీడియాతో వెంకటేష్ మాట్లాడారు. తన నెక్ట్స్ మూవీస్, వెబ్ సిరీస్ గురించి స్పందించారు.
ఇటీవల రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌ను వెంకటేష్ చేశారు. అందులో న్యూడిటీ ఓ రేంజ్లో ఉంది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. రానా నాయుడు తీసిన నెట్ ప్లిక్స్, అమెజాన్ తన కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాయని వివరించారు. రానా నాయుడు2 ఉంటుందని స్పష్టం చేశారు. తనను అందరూ ఇప్పుడు నాగా నాయుడు అంటున్నారని గుర్తుచేశారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ జనాలకు రీచ్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తనను నాగా నాయుడు అని పిలుస్తున్నారు. అది తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వెంకటేశ్ అంటున్నారు. అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. రానా నాయుడు హిందీ వెర్షన్లో న్యూడిటీ కాస్త ఎక్కువగా ఉందని.. తెలుగులో తగ్గించామని పేర్కొన్నారు. రానా నాయుడు2 లో ఇంకా తగ్గిస్తామని స్పష్టంచేశారు.
జనాలు న్యూడిటీ కోరుకోవడం లేదు.. కథ, కథనాన్ని ఇష్టపడుతున్నారని గుర్తుచేశారు. తాను చేసే ఓటీటీ కంటెంట్‌లో న్యూడిటీ లేకుండా చూసుకుంటానని తెలిపారు. బొబ్బిలి రాజా సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకుంటున్నానని వెంకటేష్ స్పష్టంచేశారు.