Charan- Upasana: మెగా ఫ్యామిలీ ఇంట యువరాణి జన్మించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ (Ram Charan)-ఉపాసన దంపతులకు లక్ష్మీదేవి పుట్టింది. ఈ తెల్లవారుజామున ఉపాసన డెలివరీ అయ్యిందని, తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి మెడికల్ బులెటిన్లో పేర్కొంది. బిడ్డ జన్మించడంతో మెగా, కామినేని కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి.
— mega family fans mncl (@TeamRC_Mancherl) June 20, 2023
కూతురిని చూసి రామ్ చరణ్ (Ram Charan) మురిసిపోయారని అతని సన్నిహితులు చెబుతున్నారు. మెగా ప్రిన్సెస్ పుట్టిందని మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన చేసింది. మెగా, కామినేని కుటుంబ సభ్యులు ఉదయం 7 గంటలకు ఆస్పత్రికి వెళ్లి రామ్ చరణ్ (Ram Charan)- ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెబుతారట. బిడ్డను ఆశీర్వదించి.. కాసేపు అక్కడే ఉంటారని తెలిసింది.
రామ్ చరణ్ (Ram Charan)- ఉపాసనలకు 2012లో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పేరంట్స్గా ప్రమోట్ అవుతున్నారని మెగా, కామినేని కుటుంబాలు గతేడాది నవంబర్ 12వ తేదీన ప్రకటించాయి. కొద్దీ రోజుల క్రితం ఉపాసన సీమంతంగా ఘనంగా జరిగింది. పెళ్లయిన కొత్తలో చిరంజీవి దంపతులతో కలిసి రామ్ చరణ్ దంపతులు ఉండేవారు. ఆ తర్వాత విడిగా ఉంటున్నామని ప్రకటించారు. బిడ్డ జన్మించాక అత్త మామలతో ఉంటామని అప్పుడే చెప్పారు. తమ ఎదుగులలో గ్రాండ్ పేరంట్స్ కీ రోల్ పోషించారని చెప్పారు. తమ బిడ్డ కూడా అలాగే పెరగాలని కోరుకుంటున్నారు.