ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్లో జాయిన్ అవనున్నాడు చరణ్. అయితే కమర్షియల్‌గా పెద్దగా ఆసక్తి చూపని చెర్రీ.. రీసెంట్గా ఓ బడా కంపెనీ యాడ్ చేసేందుకు సై అన్నట్టు టాక్. దాని కోసం చరణ్ భారీ పారితోషికం అందుకున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఒక్క ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన హలీవుడ్ ఆడియెన్స్, సెలబ్రిటీస్ చరణ్, తారక్ నటనకు ఫిదా అయిపోయారు. ఇలా వరల్డ్ వైడ్‌గా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరు యాడ్స్ విషయంలో మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయినా బడా బడా కంపెనీలు వీళ్లతో యాడ్స్ చేసేందుకు ట్రై చేస్తునే ఉన్నాయి.
మరోవైపు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కమర్షియల్‌గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో రీసెంట్గా రామ్ చరణ్ ఓ ప్రముఖ యాడ్ చేసేందుకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. హీరో మోటో కార్ప్‌కు చెందిన టూ వీలర్‌కు అంబాసిడర్‌గా ఉండనున్నాడట చరణ్. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోందని సమాచారం. ఈ ప్రకటన వచ్చేసి రెండు నిమిషాలు ఉంటుందని టాక్. దీని కోసం చరణ్ భారీ పారితోషికం అందుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల మాట. సదరు కంపెనీ ఈ యాడ్ కోసం.. చరణ్‌కు 8 కోట్లు చెల్లించినట్టు సమాచారం. దాంతో మెగా పవర్ స్టార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఆర్సీ15 షూటింగ్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవనుందని టాక్. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా మొదలుపెట్టబోతున్నాడు చరణ్.