ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న మాసివ్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్దమైంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ బాట పట్టిన రామ్‌కు.. ఆ తర్వాత చేసిన సినిమాలు హిట్ ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన లింగుసామి ‘ది వారియర్’ సినిమా.. రామ్‌ను బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కమిట్ అయ్యాడు రామ్. అఖండ వంటి హిట్ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. అలాగే ఫస్ట్ టైం భారీ బడ్జెట్‌తో రామ్, బోయపాటి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. అందుకే ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు రామ్. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. రెగ్యూలర్ షూట్‌కు రెడీ అవుతోంది. దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన రొమాన్స్ చేసే బ్యూటీ దాదాపుగా ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. గతంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించినా ఫైనల్‌గా సాక్షి వైద్యను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సాక్షి వైద్య అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న’ఏజెంట్’ మూవీలో నటిస్తోంది. ఈ ముంబై బ్యూటీకి ఇదే ఫస్ట్ తెలుగు ఫిల్మ్. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే సాక్షి క్యూట్ లుక్కు మన హీరోలు ఫిదా అవుతున్నారట. అందుకే రామ్‌తో బంఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. మరి బోయపాటి.. రామ్‌ను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.