లైగర్ దెబ్బకు పూరి జగన్నాథ్ భారీగా నష్టపోయారని.. సెట్స్ పై ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటలేకపోయాడని.. నెక్స్ట్ హీరో దొరకడం కష్టమని.. మొత్తంగా పూరి పనైపోయిందని.. రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో పూరి తన అడ్డాను మార్చినట్టు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో మాసివ్ హిట్ కొట్టిన పూరి.. అంతకు మించి అనేలా లైగర్‌లో దుమ్ములేపాలనుకున్నాడు. కానీ పూరితో పాటు విజయ్ దేవరకొండకు సీన్ రివర్స్ అయిపోయింది. దాంతో ఇద్దరిని తెగ ట్రోల్ చేశారు నెటిజన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూరికి ఏ హీరో కూడా ఛాన్స్ ఇవ్వడని ప్రచారం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ తప్ప పూరికి ఛాన్సే ఇచ్చే హీరో లేడనే వార్తలు కూడా ఊపందుకున్నాయి.
మరో వెర్షన్ ప్రకారం పూరి తన కొడుకు ఆకాష్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయినా పూరి వాట్ నెక్ట్స్ ఏంటనేది.. అధికారికంగా ఎవరికి తెలియదు. ఇక లైగర్ కోసం ముంబై వెళ్లిన పూరి.. అక్కడే పర్మినెంట్‌గా సెటిల్ అవుదామని అనుకున్నట్టు టాక్. కానీ భారీ రెంటల్ కారణంగా.. పూరి ముంబై ఫ్లాట్ ఖాళీ చేశాడని వినిపించింది. దాంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడని అనుకున్నారు. కానీ ఈ డాషింగ్ డైరెక్టర్ మాత్రం గోవాకి తన అడ్డాను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే స్క్రిప్టు కోసం బ్యాంకాక్ వెళుతూ ఉంటాడు పూరి. కానీ ఇప్పుడు గోవాలోనే కథలు రాసుకుంటున్నాడని టాక్. అందుకే గోవాలో ఒక మంచి బీచ్ ఫేసింగ్ బిల్డింగ్‌లోకి పూరి దిగబోతున్నారని టాక్. మరి పూరి నిజంగానే గోవాకి వెళ్తున్నాడా.. అనేది సందేహమే.