»Priyanka Is Happy With The Arrival Of Her Lover Gauthams Mother Brought A Punche
Lover రావడంతో ప్రియాంక హ్యాపీ.. గౌతమ్‌కు పంచె తీసుకొచ్చిన తల్లి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అప్పుడే పదో ఎపిసోడ్ వరకు వచ్చింది. ఒక్కో ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారు. నిన్న గౌతమ్ తల్లి, ప్రియాంక లవర్ శివ, బోలే భార్య వచ్చారు.
Priyanka is happy with the arrival of her lover. Gautham's mother brought a punche
Bigg boss: బిగ్ బాస్ (Bigg boss) తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా ట్విస్టులతో సాగుతోంది. అప్పుడే పదో వారంలోకి షో వచ్చేసింది. ఇంకేముంది.. కంటెస్టెంట్ల ఫ్యామిలీలు వస్తున్నారు. అశ్విని (ashwini), శివాజీ (shivaji), అర్జున్ (arjun) ఫ్యామిలీ మెంబర్స్ రాగా.. నిన్నటి ఎపిసోడ్లో ప్రియాంక లవర్, గౌతమ్ తల్లి, బోలే భార్య వచ్చారు.
ఫస్ట్ గౌతమ్ తల్లి వచ్చారు. గౌతమ్ డాక్టర్ కాగా.. ఆమె తల్లి టీచర్. వస్తూనే కొడుకుకు పంచె తీసుకొచ్చారు. తల్లిని చూసి హగ్ చేసుకున్న కుమారుడు.. వెంటనే పంచె కట్టుకున్నాడు. అమ్మను చూసి ఎమోషనల్ అయ్యాడు. గౌతమ్ బాగా ఆడుతున్నాడని.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని అతని తల్లి చెప్పింది. కోపం తగ్గించుకోవాలని సూచించింది. ఇంట్లో ఉన్న సభ్యులకి కూడా గోరు ముద్దలు తినిపించింది.
తర్వాత ప్రియాంక లవర్ శివకుమార్ వచ్చాడు. హగ్ చేసుకుని, కిస్ చేశాడు. పెళ్లి గురించి మాట్లాడారు. చెవికి పోగు వేయించుకోవడంతో ఇదేంటి.. అని పదే పదే ప్రియాంక అడిగింది. సర్ ఫ్రైజ్ అంటూ సమాధానం దాటవేశాడు. అందరినీ సర్ అని పిలిచి.. వారి హృదయాలను గెలిచాడు. అశ్వినిని చాలామంది తొక్కేస్తున్నారని.. మీ కోసం అభిమానులం ఉన్నామని చెప్పాడు. దీంతో ప్రియాంక మొహం వాడి పోయినట్టు అయ్యింది. చిన్న చిన్న విషయాలను తాగుతున్నావని.. ఎందుకు ఆరుస్తున్నావని అడిగాడు. ఏ విషయం ఉన్న చెప్పి.. వదిలేయ్ అని సూచించాడు. సోలోగా ఆడాలని స్పష్టంచేశాడు.
చివరలో బోలే భార్య వచ్చారు. ఆమె వచ్చే సమయంలో బోలే పాట పాడుతూ హుషారుగా ఉన్నాడు. భార్య కోసం పాట పాడాలని బిగ్ బిస్ అడగగా.. సరే అంటూ అందుకున్నారు. తనకు కుమారుడు గుర్తుకొస్తున్నాడని కన్నీరు పెట్టుకున్నాడు. కప్ గెలుచుకుని వస్తానని కాదు, అందరి మనసు గెలుచుకుని వస్తానని చెప్పాడు. తర్వాత స్కూల్ గేమ్ కొనసాగింది.