Poonam Pandey: నటి, మోడల్ పూనమ్ పాండే ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రొమాంటిక్ స్టార్ గా పూనమ్ ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంత చిన్న వయసులో ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పూనమ్ మరణవార్త విన్న ఆమె బాడీ గార్డ్ ఆమె లేరంటే నమ్మలేకపోతున్నాడు. పూనమ్ చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆయన ప్రశ్నించారు.
పూనమ్‌కి 11 ఏళ్లుగా బాడీగార్డ్‌గా పనిచేస్తున్న అమీన్ ఖాన్.. పూనమ్ చనిపోలేదు.. ఆమె చనిపోయిందంటే నేను నమ్మను. ఆమెతో చాలా ఏళ్లుగా పనిచేశాను.. పూనమ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. .జనవరి 31న ఇద్దరం కలిశాం. ఒక మాల్లో ఫోటోషూట్‌కి వెళ్లినప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఆ సమయంలో పూనమ్ చాలా ఆరోగ్యంగా ఉంది. ఆమెకు అసలు జబ్బు ఉందని నేనెప్పుడు వినలేదు. ఉదయం నేను కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నాను. వెంటనే పూనమ్ సోదరి ఇంటికి వెళ్లి.. నిజమెంటో తెలుసుకుందామని ప్రయత్నించాను. కానీ, ఆమె నా ఫోన్స్ ఆన్సర్ చేయడం లేదు. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను. కొన్నిరోజుల క్రితం పూనమ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా నార్మల్ గానే కనిపించింది. ఆమె ఆల్కహాల్ తీసుకోవడం కూడా మానేసింది. అసలు నిజాలు తెలియాలంటే.. పూనమ్ సోదరి చెప్పాల్సిందే”..మరి పూనమ్ చెల్లి మీడియా ముందుకు వస్తుందేమో చూడాలి.