Poonam Kaur Fires On Pawan Kalyan Ustaad Bhagat Singh Poster
Poonam Kaur:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) అంటే చాలు నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) ఓ రేంజ్లో ఫైర్ అవుతారు. ఆ మధ్య ట్వీట్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. పవన్ కొత్త మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పోస్టర్ గురించి పూనమ్ కౌర్ (Poonam Kaur) స్పందించారు. పూనమ్ కామెంట్లను పవన్ అభిమానులు (Pawan Fans) మండిపడుతున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు సంబంధించి నిన్న మూవీ యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో పవన్ కల్యాణ్ కాళ్లు.. కాళ్ల కింద ఉస్తాద్ భగత్ సింగ్ పేరు ఉంది. దీనిని పూనమ్ కౌర్ (Poonam Kaur) తప్పుపట్టారు. ఈగోనా.. లేదంటే నిర్లక్ష్యమా అంటూ ఫైరయ్యారు. ఇలా చేయడం అంటే మహానీయుడిని అవమానించడమే అని మండిపడింది.
పోస్టర్‌కు (poster) సంబంధించి భగత్ సింగ్ యూనియన్ రిపోర్ట్ చేయాలని ట్వీట్ చేసింది. ఏం పని లేదా అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (fans) ఫైర్ అవుతున్నారు. ఆ తర్వాత మళ్లీ రియాక్ట్ అవుతూ.. స్వతంత్ర సమరయోధులను మీరు గౌరవించడం లేదని పేర్కొన్నారు.
వారికి కనీసం మర్యాద ఇవ్వాలని సూచించారు. ఇలా కించపరచడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. తీరు మార్చుకోవాలని సూచించారు. పూనమ్ (poonam)- పవన్ (pawan) మధ్య ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. పరోక్షంగా ట్వీట్లు చేస్తూ.. త్రివిక్రమ్ (trivikram) మీద కౌంటర్లు వేస్తుంటారు.