సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధలో ఉన్న మహేష్ బాబుని ఓదార్చారు. కాగా… వారిలో… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయన…కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కృష్ణ గారి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. చాలా తక్కువ సమయంలోనే మహేష్ బాబు గారు.. కుటుంబంలోని ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం చాలా బాధాకరం. ఆయనకు, ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
ఇక మహేష్ బాబు ను ఓదార్చడం ఎవరి వలన కావడం లేదని తెలుస్తోంది. మహేష్ ను అలా చూసిన అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. కొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ సైతం కృష్ణకు నివాళులు అర్పించడానికి రానున్నారు.