»Pawan Kalyan Not Harihara Veeramallu Doing A Web Series
Pawan Kalyan: హరిహర వీరమల్లు కాదు.. వెబ్ సిరీస్ చేస్తున్నాడట?
క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ పవర్ స్టార్ లాంటి స్టార్ హీరో సినిమాతో గత రెండు మూడేళ్లుగా లాక్ అయిపోవడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఈ గ్యాప్‌లో కనీసం ఒక్క సినిమా అయిన కంప్లీట్ చేసి ఉండేవారు. కానీ అలా చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు ‘హరిహర వీరమల్లు’ ఓ బిగ్గెస్ట్ డిసప్పాయింట్. అసలు ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయంలో ఎవ్వరు క్లారిటీ ఇవ్వడం లేదు. డైరెక్టర్ క్రిష్ కూడా ఎక్కడా స్పందించడం లేదు. ఇప్పట్లో హరిహర షూటింగ్ కష్టమే అని అంతా ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏపి ఎన్నికల తర్వాతే ఈ సినిమాను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్. దీంతో క్రిష్ ఈ సినిమాను పక్కకు పెట్టేసి.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే స్క్రిప్టు కూడా రెడీ చేసుకున్నాడట క్రిష్. అయితే సినిమా కాకుండా ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ డేట్స్ ఇచ్చే లోపు క్రిష్ ఈ వెబ్ సీరీస్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే, స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యిందట. ప్రస్తుతం ఈ సిరీస్‌లో నటించే నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టుగా ఇండస్ట్రీ టాక్. ఈ సిరీస్్లో ఓ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తోందట.
వీలైనంత త్వరగా ఈ సిరీస్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత హరిహర వీరమల్లు పై ఫోకస్ చేయనున్నాడని సమాచారం. త్వరలోనే క్రిష్ కొత్త ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. మరి క్రిష్ నిజంగానే సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా? అసలు ప్రజెంట్ క్రిష్ ఏం చేస్తున్నాడు? ఇలాంటి వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే.. స్వయంగా క్రిష్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.