»Game Changer Waiting For Charan Okadi Comedy Brahma For Game Changer
Game Changer: చరణ్ ఒక్కడి కోసం వెయిటింగ్.. ‘గేమ్ చేంజర్’ కోసం హాస్య బ్రహ్మ?
ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోల సినిమాల నుంచి ఒక్కొక్క అప్డేట్ బయటికొస్తు ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు. అయితే.. ఈ సినిమాలో హాస్య బ్రహ్మ కూడా జాయిన్ అయ్యాడని తెలిసి సంతోషపడుతున్నారు.
Game Changer: మహేష్ ‘గుంటూరు కారం’ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా.. లేటెస్ట్గా ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ గ్లింప్స్ బయటికొచ్చింది. ప్రభాస్ నుంచి ఈ వారంలోనే కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే మారుతి సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ని సంక్రాంతికి రివీల్ చేయనున్నారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాత్రం గేమ్ చేంజర్ దగ్గర స్ట్రక్ అయిపోయాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో శంకర్ డైరెక్షన్లో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో.. గేమ్ చేంజర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే లీక్ అయిన చరణ్ లుక్స్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ.. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్మాత దిల్ రాజు ఇటీవలె చెప్పుకొచ్చారు. కాబట్టి గేమ్ చేంజర్ అసలు గేమ్ స్టార్ట్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి అసలు సిసలు ట్రీట్ ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఒక్క రామ్ చరణ్ తప్పా.. తన తోటి బిగ్ స్టార్స్ చిత్రాల తాలూకా అప్డేట్స్ అందరి నుంచి వచ్చేశాయి.
దీంతో నెక్స్ట్ అందరి ఫోకస్ గేమ్ చేంజర్ పైనే ఉంది. గేమ్ చేంజర్ గ్లింప్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ మధ్య సినిమాలు తగ్గించిన బ్రహ్మానందం ఇటీవలె కీడా కోలా సినిమాలో అలరించారు. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో అతిథి పాత్ర కోసం షూటింగ్లో కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది.