సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న హనుమాన్ పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే.. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడమే లేట్, టికెట్స్ హాట్ కెకుల్లా మారిపోతున్నాయి.
Hanuman: మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున.. ఈ స్టార్ హీరోలతో సై అంటూ సంక్రాంతి బరిలోకి దూసుకొస్తున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. గుంటూరు కారం రిలీజ్ రోజే హనుమాన్ రిలీజ్ అవుతోంది. గుంటూరు కారం రీజనల్ లెవల్లో రిలీజ్ అవుతుంటే.. హనుమాన్ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది. తెలుగులో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. మిగతా భాషల్లో మాత్రం హనుమాన్కు బాగానే కలిసిరానుంది. ముఖ్యంగా నార్త్‌లో హనుమాన్ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన చాలు.. కలెక్షన్స్ ఓ రేంజ్లో ఉంటాయి.
అయోధ్య మందిరం ఆరంభం కూడా ఉంది కాబట్టి.. హనుమాన్కు హిట్ టాక్ వస్తే మామూలుగా ఉండదు. ఇక జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఓ రోజు ముందే ప్రీమియర్స్ సోష్ స్టార్ట్ అయ్యాయి. జనవరి 12న గుంటూరు కారం సినిమా వస్తుండడంతో.. హనుమాన్ చిత్ర యూనిట్ థియేటర్ల కొరత కారణంగా ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేయడానికి రెడీ అయ్యారు. జనవరి 11 నుంచి హైదరాబాద్‌తో పాటు ఇంకొన్ని ఏరియాల్లో సెలెక్టెడ్ సెంటర్స్‌లో హనుమాన్ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి.
ఈ ప్రీమియర్స్‌కి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ముఖ్యంగా నైజాం సెంటర్స్‌లో హనుమాన్ బుకింగ్స్ స్పీడ్‌గా కంప్లీట్ అయ్యాయి. దీంతో హనుమాన్ మూవీని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రీమియర్స్ కోసం షోస్ పెంచే పనిలో ఉన్నారు. మరి ప్రీమియర్స్‌తోనే హాట్ కేక్‌గా మారిన హనుమాన్ సినిమా.. ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.