విజయవాడలోని నోవాటెల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేశారు.
Chandrababu: విజయవాడలోని నోవాటెల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. టీడీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. సుమారుగా 6-7 వేల కేసులు పెట్టారని తెలిపారు. పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారన్నారు. ఎన్నికల్లో ఎవరు పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు.
వైసీపీ నేతల కుట్రలన్నింటిని సీఈసీకి వివరించామని తెలిపారు. ప్రజాస్వమాన్యాన్ని కాపాడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలి. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? బీఎల్వోలుగా 2600 మంది మహిళా పోలీసులను నియమించారు. అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను రాష్ట్రానికి పంపాలి. ప్రజాస్వమ్య పరిరక్షణకు మా ప్రయత్నాలన్నీ చేస్తాం. ఒక్క దొంగ ఓటు ఉన్న ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామని తెలిపారు.