»Team India Pacer Mohammad Shami Sairaj Chirag Shetty Received National Sports Awards
National Sports Awards: రాష్ట్రపతి నుంచి అర్జున అవార్డు అందుకున్న షమీ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా ఈరోజు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఇండియా పేసర్ షమీ అర్జున అవార్డు అందుకున్నారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ఖేల్‌రత్న అవార్డులను సొంతం చేసుకుంది.
Team India pacer Mohammad Shami, Sairaj- Chirag Shetty received National Sports Awards
National Sports Awards: ఢిల్లీలో మంగళవారం 2023 జాతీయ క్రీడా పురస్కారాల(National Sports Awards) ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) అవార్డులను అందజేశారు. ఇండియా క్రికెట్ టీమ్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) అర్జున అవార్డు అందుకున్నారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అవార్డును సొంతం చేసుకుంది. ఈ జోడీ ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచఛాంపియన్ షిప్లో కాంస్యం, కామన్వెల్త్క్రిడల్లో రజత పతకాలను సాధించింది.
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో షమీ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. 33 ఏళ్ల షమీ ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు… 101 వన్డేల్లో 195 వికెట్లు… 23 అంతర్జాతీయ టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో 88 మ్యాచ్ ల్లోనే 332 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో షమి అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 26 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్ (షూటింగ్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), అజయ్‌కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)లకు ఈ అవార్డులు దక్కాయి.