Revanth Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారు. చుట్టాలనో, అనుచరులనో అసమర్థులైన అధికారును మండలాల్లో నియమించుకుని మీకు అనుకూలంగా పనులు చేయించుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఇలా చేస్తే సహించేది లేదు. ప్రతి అధికారి ఏం చేస్తున్నారనేది ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతిరోజు నాకు తెలుస్తుందని తెలిపారు. అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే మీకు కూడా చెడ్డపేరు వస్తుందని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు.
ప్రతి వ్యవస్థలో ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు పనిచేయాలని తెలిపారు. జనవరి 26 తర్వాత వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని కూడా తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని తెలిపారు. మొత్తం 17 నియోజవర్గాల్లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజవర్గానికి రూ.10 కోట్లు ఇస్తామని సీఎం వెల్లడించారు.