»Mohammad Shami Shami Enters Politics Competition From Bjp
Mohammad Shami: రాజకీయాల్లోకి షమీ.. బీజేపీ నుంచి పోటీ?
ఇప్పటికే పలువురు క్రికెటర్లు రాజకీయాల్లో ఉన్నారు. మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Mohammad Shami: ఇప్పటికే పలువురు క్రికెటర్లు రాజకీయాల్లో ఉన్నారు. మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో షమి పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ విషయంలో ఇప్పటికే బీజేపీ క్రికెటర్ షమిని సంప్రదించినట్లు సమాచారం. అయితే పార్టీ ప్రతిపాదనపై షమి తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని సమాచారం. పశ్చిమ బెంగాల్లోని బసిర్హత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది.
ఇటీవల షమి తన కుడికాలి చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సర్జరీ విషయాన్ని షమి సోషల్ మీడియాలో వెల్లడించగా మోదీ స్పందించారు. త్వరగా కోలుకోవాలని కోరారు. గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధాని టీమిండియా ఆటగాళ్లను కలిసి ఓదార్చారు. ఆ టోర్నీలో షమి అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు మోదీ అతనిని ప్రత్యేకంగా అభినందించారు.