భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పోచంపల్లిలో పర్యటించారు. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించారు. చేనేత కార్మికులను చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(Draupadi Murmu) పోచంపల్లి(Pochampally)లో పర్యటించారు. అక్కడ చేనేత కార్మికులను చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు. చేనేత మగ్గాలను, టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించారు. చేనేత రంగంలో వివిధ అవార్డు గ్రహీతలు, చేనేత కార్మికులతో సమావేశమై ప్రసంగించారు. చేనేత కళ అనేది ఎంతో ప్రత్యేకమైనది, అతి పూరతనమైన ఈ కళ ఇప్పటికి ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతుంది. నేటి వస్త్రపరిశ్రమలో పోచంపల్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భావి తరాలకు ఈ కళను అందించాలని కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయం అని రాష్ట్రపతి అన్నారు.
ఈ పర్యటన తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, చేనేత కార్మికుల సలహాలను పరిగణలోకి తీసుకుంటానని, పోచంపల్లి అభివృద్ధిని తనవంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ఈరోజు పోచంపల్లిలో పర్యటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.