Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని సభకు వివరించి.. 42 పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదని భట్టి పేర్కొన్నారు. రోజూవారీ ఖర్చులకు ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి తెలిపారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తున్నాను. పదేళ్ల పాటు జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని అన్నారు.
42 పేజీల పుస్తకాన్ని ఇచ్చి వెంటనే మాట్లాడమంటే ఎలా అని మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికను చదివే సమయం కూడా మాకు ఇవ్వలేదని.. ముందు రోజే డాక్యుమెంట్ ఇస్తే బాగుండేదని తెలిపారు. నోట్ ప్రిపేర్ అయ్యేందుకు కనీసం టీ బ్రేక్ అయిన ఇస్తే బాగుంటుందని అన్నారు. దీంతో స్పీకర్ టీ బ్రేక్ ఇస్తూ సభను అరగంట పాటు వాయిదా వేశారు.
శ్వేతపత్రంలో రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు ఉన్నాయి. అలాగే 2014-2015 నాటికి రుణం రూ.72,658 కోట్లు. 2014-2015 నుంచి 2022-2023 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు. 2023-2024 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు. 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూలో పెరిగిన 34 శాతం రాబడి. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం ఉంది. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్ల వ్యయం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణ భారం అని శ్వేత పత్రంలో పేర్కొన్నారు.