»Police Are Searching For Pallavi Prashanth To Arrest
Pallavi Prashanth కోసం గాలిస్తున్న పోలీసులు.. పరారీలో రైతుబిడ్డ..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఫైనల్స్ జరిగిన రోజు రాత్రి జరిగిన అల్లర్లకు కారణమైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ మంగళవారం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.
Police are searching for Pallavi Prashanth to arrest
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఫైనల్స్ జరిగిన రోజు రాత్రి జరిగిన అల్లర్లకు కారణమైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ మంగళవారం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ప్రశాంత్ తోపాటు, అతని సోదరుడు పరశారాములు కోసం గ్రామానికి ఒక బృందాన్ని పంపారు. ప్రశాంత్ కారు డ్రైవర్ సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్‌పై సోదాలు చేసేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రశాంత్ అనుచరుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు. కొమరవెల్లి సమీపంలో ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ లొకేషన్ కనుగొన్నారు. పోలీసులు అక్కడికి ఒక బృందాన్ని కూడా పంపించారు. బస్సులపై రాళ్లు రువ్విన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు రాగానే పల్లవి ప్రశాంత్ అభిమానులు రన్నరప్ అమర్దీప్ కుటుంబ సభ్యులపై దాడికి ప్రయత్నించారు. దీంతో అమర్దీప్ కారు ధ్వంసమైంది. గ్రాండ్ ఫినాలే తర్వాత, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయలుదేరిన పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు రచ్చ చేయకుండా పంపించారు. అతను తిరిగి వచ్చి పోలీసుల సూచనలను ఖాతరు చేయలేదు. ఇది పెద్ద రచ్చకు కారణమైంది.
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్లను కూడా ధ్వంసం చేశారు. ఘటనను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. అభిమానులను రెచ్చగొట్టినందుకు అమర్దీప్ చౌదరిపై కూడా కేసు నమోదైంది. బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా పోలీసులు గొడవ చేస్తామని ముందే హెచ్చరించినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారిపై కేసు నమోదైనట్లు సమాచారం. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌ల అభిమానులను గుర్తించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.