»Tirumala Visions Of Vaikuntha Instructions For Devotees
Tirumala: వైకుంఠ ద్వార దర్శన భక్తులకు.. టీటీడీ సూచనలు
ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లాలనుకునే తిరుమల భక్తులకు అలర్ట్. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు భక్తులకు సూచనలు చేసింది.
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు టీడీపీ కొన్ని సూచనలు చేసింది. వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి సుమారు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపింది. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో రద్దీ పెరగనున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
పదిరోజుల పాటు సిఫారసు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేసింది. ఒకవేళ వీఐపీలు కుటుంబ సభ్యులతో దర్శనానికి వస్తే టోకెన్లు ఇస్తామని తెలిపింది. దర్శనాలకు వచ్చే భక్తుల కోసం తిరుపతిలో 92 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో నిరంతరాయంగా సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇవ్వనున్నారు. అలాగే సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఉచిత టైమ్‌స్లాట్ టోకెన్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. తిరుపతిలోనే టోకెన్లు తీసుకున్న తర్వాత తిరుమలకు రావాలని భక్తులకు తెలిపింది. టికెట్లు లేకుండా తిరుమలకు రావచ్చు. కానీ వాళ్లకు దర్శనం ఉండదని తెలిపింది.
వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు.. తమ టోకెటన్లపై సూచించిన తేదీ, సమయానికే తిరుమలకు రావాలని సూచించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శనం ఫలితం 10 రోజులు ఉంటుంది. వీఐపీలు, ఇతర భక్తులు తొలిరోజైన ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలని తొందరపడవద్దు. పది రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.