»Donald Trump The Sensational Verdict Of The Supreme Court A Huge Shock For Trump
Donald Trump: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ట్రంప్‌కు భారీ షాక్!
డొనాల్డ్ ట్రంప్‌కి కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్‌పై ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. అమెరికా క్యాపిటల్ హింస కేసులో కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్‌పై ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు వచ్చే ఏడాది మార్చిలో జరిగే కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్‌పై మాత్రమే కాకుండా నవంబర్ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా అనర్హత వేటు వేసింది.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం అధ్యక్ష అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్‌కు కోర్టు కల్పించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి రాష్ట్ర కోర్టు తీర్పు జనవరి 4 వరకు గడువు ఇచ్చింది. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించిన కారణంగా ఆ దేశ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.