»Ipl Mini Auction 2024 Highest Bidder In Ipl History
IPL Mini Auction 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడు
ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం నిన్న దుబాయ్‌లో జరిగింది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఆటగాళ్లు పదిరెట్లు కంటే ఎక్కువ మొత్తంలో వీళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
IPL Mini Auction 2024: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఆ ఆటగాడిని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలం పాటలో స్టార్క్‌ను దక్కించుకునేందుకు చివరి వరకు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం చేసింది. కానీ చివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. స్టార్క్ గత 8 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడలేదు. కానీ 2023 వరల్డ్ కప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఫైనల్లో జట్టు విజయం కోసం కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం స్టార్క్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ వేలంలో అతని పేరు రాగానే స్టార్క్‌ను సొంతం చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పెద్ద మొత్తంలో వేలం వేసింది. ఇవి తప్పుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ హోరాహోరిగా పోటీపడ్డాయి. చివరికి కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడికి పది రెట్ల కంటే ఎక్కువ మొత్తం లభించింది.
స్టార్క్ కంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ వేలంలో కమ్మిన్స్‌ను రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన కమ్మిన్స్ కోసం ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో కమ్మిన్స్‌ను భారీ ధరకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.