»India Maldives Dispute Chinas Crooked Mind Exposed
India-Maldives: భారత్-మాల్దీవుల వివాదం.. బయటపడిన చైనా అసలు రంగు
భారత్‌పై చైనా మరోసారి అక్కసును వెల్లగక్కింది. మాల్దీవుల వివాదంపై స్పందించిన చైనా.. భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలంటూ పేర్కొంది. ఇక ఇండియాతో మాల్దీవులు వైరం పెట్టుకోమని చైనా ఎప్పుడు చెప్పలేదని తమ దేశ అధికారిక పత్రికలో ప్రచురించింది.
India-Maldives dispute.. China's crooked mind exposed
India-Maldives: భారత ప్రధాని మోడీ(PM Modi) లక్షద్వీప్ (Lakshadweep) పర్యటనతో మాల్దీవుల మంత్రులు, ఎంపీలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో మాల్దీవ్స్ అధ్యక్షుడు మోడీని ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చైనా స్పందించింది. మాల్దీవుల విషయంలో భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ఈ విషయాన్ని ప్రచురించింది. మాల్దీవులను ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తామని రాసుకొచ్చింది.
మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్న వేళ ఈ కథనం రావడంతో చైనా అసలు రంగు బయటపడింది. భారత్, చైనా మధ్య ఘర్షణల కారణంగా ఢిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు చైనా ఎప్పుడూ చెప్పలదని పేర్కొంది. ఈ ద్వీప దేశానికి భారత్ నుంచి వచ్చే సహకారం చైనా ముప్పుగా భావించలేదని తెలిపింది. ఇప్పటికే దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దౌత్యపరమైన విషయాల్లో భారత్ మరింత విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని చైనా అక్కసు వెళ్లగక్కింది. మయిజ్జు మాల్దీవుల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తమ భూభాగంలో ఉన్న భారత బలగాలను తొలగించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ లక్షద్వీప్‌లో సందర్శించిన ఫోటోలను పంచుకున్నారు. దీంతో మాల్దీవులు మంత్రులు రెచ్చెగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది.